తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అసెంబ్లీలో న్యాయవాదుల ప్రొటెక్షన్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వం ఈ బిల్లును పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఈ బిల్లును తీసుకురావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.