అచ్చంపేట: సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ ప్రణాళికలో భాగంగా, 9వ వార్డులో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో పర్యటించి, స్థానిక ప్రజల తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్