అచ్చంపేట: పాఠశాలలో డైనింగ్ హాల్ కు ఎమ్మెల్యే భూమి పూజ

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో భోజనశాల భవనానికి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ బుధవారం భూమి పూజ చేశారు. ఉప్పునుంతలకు చెందిన MSR ప్రాజెక్టు అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మద్దు సుభాష్ రెడ్డి, మడ్డి నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లు ప్రభుత్వ పాఠశాల, పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రూ. 30 లక్షల విరాళం అందజేశారు. ఈ విరాళంతో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా భోజనశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్