నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని డిండి కట్ట మైసమ్మ ఆలయంలో నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డిండి కట్ట మైసమ్మ ఆలయ ప్రాంగణం అభివృద్ధికి, బోటింగ్, రిసార్ట్ ఏర్పాటుకు రూ. 10 కోట్ల నిధులతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి మరో మైసిగండిలా తీర్చిదిద్దాలని కోరారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కోరిక మేరకు నూతన కమిటీని నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.