అచ్చంపేట: గంజాయి, డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా పోలీసుల సోదాలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండల కేంద్రంలో బుధవారం పోలీసులు మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, వ్యాపార సముదాయాలలో బెల్జియం స్నిఫర్ డాగ్‌తో సోదాలు నిర్వహించారు. యువత గంజాయికి బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని పదర ఎస్ఐ వినోద్ కుమార్ సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్