నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని లింగమయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. రెండవ రోజు గురువారం ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు సలేశ్వరం జాతరకు తరలివచ్చారు. దట్టమైన అటవీ మార్గంలో ప్రయాణిస్తూ, లోయల గుండా సాగే ఈ యాత్ర భక్తి పారవశ్యంతో నిండిపోయింది. జాతర ప్రారంభమైన తొలిరోజే భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడంతో అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగుతోంది. భక్తులకు తాగునీరు, సౌకర్యాలను స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయి.