నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు ఎంపీడీఓ బ్రహ్మచారి, హైదరాబాద్ రవీంద్రభారతిలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, కళా కౌశికుడు అనే కామెడీ విలన్ పాత్రలో నటించి ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు, సాంస్కృతిక శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఐఏఎస్ అధికారి నర్సింహారెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రశంసాపత్రం అందుకున్నారు.