నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం గ్రామ యువకులు ఆదివారం రాత్రి ఎన్నికల ప్రలోభాలకు లొంగొద్దని వినూత్న నిరసన చేపట్టారు. 'ఓటరు మేలుకో. నీ భవిష్యత్తు మార్చుకో' అనే నినాదంతో ప్రత్యేక వాల్ పోస్టర్లను గ్రామ గోడలపై అతికించి, అభివృద్ధి చేయగల వారికి ఓటు వేయాలని, డబ్బు, మద్యం ఆఫర్లతో ప్రభావితం చేసేవారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు సందేశించారు.