నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలం చాకలి గుడిసెలు గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పసుపులేటి మణెమ్మ (45) పొలంలో పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.