నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సోమవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.