నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామ శివారులో మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అయితే, చేతికి గాజులు, కాళ్లకు మెట్టెలు ఉండటంతో ఇది మహిళ మృతదేహమని గుర్తించారు. మొక్కజొన్న కుప్పల మధ్య లభించిన ఈ మృతదేహం ఎవరిదో గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంషాద్దీన్ తెలిపారు.