నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట ఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన రాజకీయ జీవితానికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞత సభకు హాజరైన సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.