కల్వకుర్తి 11వ వార్డు నుంచి సీపీఐ అభ్యర్థి ధార దాసు నామినేషన్ దాఖలు

నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు అభ్యర్థిగా సీపీఐ పార్టీ తరపున ధార దాసు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ పులిజ్వల పరశురాములుతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ పార్టీకి 11వ వార్డు ప్రజలు అండగా నిలవాలని, తమ అభ్యర్థిని గెలిపించాలని పార్టీ ఇంచార్జ్ పరశురాములు ప్రజలను కోరారు. ప్రజల కోసం కొట్లాడుతున్న సీపీఐ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్