శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజా విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని, విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.