నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను అకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఏడాది పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించామని ఆయన పేర్కొన్నారు.