నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచికుళ్ల రాజేశ్ రెడ్డి శుక్రవారం తాడూరు మండలంలోని మేడిపూర్ గ్రామంలో రైతులకు ప్లాస్టిక్ ట్రేలు, సేంద్రియ ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.