దేశంలోనే వెనుకబడిన నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి కోరారు. శుక్రవారం పార్లమెంటులో మాట్లాడుతూ, నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు మొగ్గు చూపాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ అభివృద్ధి కోసం ఎంపీ లోకసభలో గళమెత్తారు.