అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని మర్లపాడు తండాను సందర్శించి, తండా వాసులతో మాట్లాడి వరద పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం వరద ప్రభావంతో అతలాకుతలం అయిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోహర్, పర్వతాలు, వంశీ నాయక్ పాల్గొన్నారు.