ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఏప్రిల్ 2వ తేదీన ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్ తో కలిసి జిల్లా అధికారులకు ఈ సూచనలు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీతో పాటు మున్సిపాలిటీలోని ప్రతి వార్డులోనూ గ్రామ సభను తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.