నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల కొండపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం వద్ద శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండపై నుంచి జలపాతం ఆహ్లాదకరంగా కనువిందు చేస్తోంది. ఈ ప్రకృతి రమణీయత భక్తులకు సంతృప్తినిస్తుండగా, భారీగా జలపాతం దూకుతున్న నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి శనివారం భక్తులకు సూచించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.