ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్ పేటకు సినీహీరో విజయ్ దేవరకొండ, రష్మిక రానున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 180 మంది విద్యార్థులకు వారి చేతుల మీదుగా స్కాలర్షిప్ లు అందించనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రతిభావంతులైన విద్యార్థులకు సాయం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత కేశవ పాటిల్, డిఈఓ హాజరు కానున్నారు.