నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో నామినేషన్ల మొదటి రోజు బుధవారం 14 మంది అభ్యర్థులు తమ పత్రాలను దాఖలు చేశారు. మున్సిపాలిటీ కమిషనర్ షేక్ మహమూద్ తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బీజేపీ నుంచి ఐదుగురు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజుల గడువు ఉందని, అభ్యర్థులు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.