కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ పరిధిలోని అంతిరెడ్డిపల్లిలో ఆదివారం తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. గోరటి అలివేలు అనే మహిళ ఫిబ్రవరి 27న ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చి చూడగా, ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని అర్ధ తులం బంగారం, రెండు వెండి మొలతాడులు, రూ. 10 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని పోయినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.