కల్వకుర్తి: నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ సిబ్బంది బుధవారం పలు గ్రామాలలో నాటు సారా స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గుండూరు, ఎల్లికట్ట, తోటపల్లి గ్రామాలలో తనిఖీలు చేపట్టి, అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్