నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో వివాహేతర సంబంధం కారణంగా ఒకే కుటుంబంలోని ముగ్గురిపై మారణాయుధాలతో దాడి జరిగింది. సంజాపూర్ వాసి గుర్రం మల్లేష్కు వెల్దండ(M) చెరుకూరు వాసి శిరీషతో గతేడాది వివాహమైంది. మల్లేష్కు పెళ్లికి ముందే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో, ఈ విషయంపై ఆగ్రహించిన శిరీష బంధువులు మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేలు, తమ్ముడు పరమేశ్ లను పిలిపించుకుని దాడి చేశారు.