నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద గంటల తరబడి నిరీక్షించినా ఎరువులు లభించకపోవడంతో ఆదివారం అన్నదాతలు రోడ్డెక్కారు. హైదరాబాద్ చౌరస్తా వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాగు సమయం మించిపోతున్నా యూరియా పంపిణీ చేయకపోవడంపై మండిపడుతూ, తక్షణమే స్టాక్ అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.