రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తిమ్మరాశిపల్లి వద్ద రూపుదిద్దుకోనున్న 33/11కేవీ విద్యుత్ సబ్జెస్టేషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రైతులకు సాగునీటితో పాటు విద్యుత్ ఎంతో కీలకమని, నాణ్యమైన కరెంట్ సరఫరా కోసమే ఈ చర్యలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.