విద్యార్థి దశ నుంచే క్రీడలపై దృష్టి సారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కల్వకుర్తి సీఐ నాగార్జున అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో శనివారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికను ఎస్ఐ మాధవరెడ్డితో కలిసి సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ నాగార్జున మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దారుఢ్యం పెరగడమే కాకుండా మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు.