నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రం, పరిసర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. ఆకాశం నుంచి మంచు ముక్కలు రాలినట్లుగా పడిన వడగండ్లతో రోడ్లన్నీ తెల్లగా మారాయి. ఊర్కొండ, ఊర్కొండపేట, పలు సమీప గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వడగండ్ల వాన వల్ల వరి, మొక్కజొన్న, మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.