నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఊర్కొండ మండలం మాధారం చెరువులో చేపల వేటకు వెళ్లి రాచాలపల్లికి చెందిన బూర్గుల వెంకటయ్య (46) గల్లంతయ్యారు. 24 గంటలు గడిచినా ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గురువారం గాలింపు చర్యలను ఎంఆర్ యూసుఫ్ అలీ, ఎస్ఐ కృష్ణదేవలు సమీక్షించారు. గజ ఈతగాళ్లతో చెరువులో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.