కల్వకుర్తి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి కృషిచేస్తా: మంత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పటంలోని సర్వే నంబర్ 99లో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్