కల్వకుర్తి నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా జైపాల్ యాదవ్ ఏనాడూ వంద పడకల ఆసుపత్రి గురించి పట్టించుకోకుండా, ఇప్పుడు ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ మనీలా భర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ్ యాదవ్ అన్నారు. ఆయన స్వగృహంలో ఆదివారం మాట్లాడుతూ పాత గోడలకు కొత్త రంగులు అంటూ మాట్లాడడం మాజీ ఎమ్మెల్యే విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.