నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 113 మహిళా సంఘాలకు రూ. 7. 13 కోట్ల విలువైన చెక్కును మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం మహిళా సంఘం ప్రతినిధులకు అందజేశారు. మెప్మా ద్వారా మహిళా సాధికారత బ్యాంక్ లింకేజీ కింద ఈ నిధులను వారికి అందించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని అన్నారు.