కొల్లాపూర్: కనువిందు చేసిన 'బ్లడ్ మూన్'

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం అద్భుతంగా కనువిందు చేసింది. మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు సంపూర్ణ స్థితికి చేరుకున్న ఈ గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారి 'బ్లడ్ మూన్'గా దర్శనమిచ్చాడు. అనంతరం సహజ సిద్ధమైన తెలుపు రంగులోకి మారాడు. కొల్లాపూర్ తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ గ్రహణం కనిపించింది, ప్రజలు దీనిని ఆసక్తిగా వీక్షించారు.

సంబంధిత పోస్ట్