కొల్లాపూర్: నిషేధిత అలివి వలలు పట్టివేత

కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం వెల్లటూరు గ్రామ శివారులో కృష్ణానది తీరంలో చేపట్టిన ఆకస్మిక దాడులలో పోలీసులు రెండు భారీ నిషేధిత అలివి వలలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నమ్మదగ్గ సమాచారంతో వనపర్తి జిల్లా పోలీసు సీఐ రత్నం, ఎస్ఐ రామన్ గౌడ్ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఒక నిందితుడు పరారవగా, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాంతానికి చెందిన రాజు (తండ్రి: కాశీనాథ్) అనే ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. దాడులలో ఎత్తున నిషేధిత అలివి వలలను పట్టుకొని పలువురు ఆంధ్ర జాలర్లను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్