నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలంలోని మరికల్ గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ జాబితాలో జరిగిన అవకతవకలపై ఎన్నికల కమిషన్ కు సోమవారం ఫిర్యాదు చేసినట్లు యువ నాయకుడు బొల్లె జగన్ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ జాబితాలో అనేక పొరపాట్లు ఉన్నాయని వాటిని వెంటనే సరి చేయాలని కోరుతూ ఎన్నికల సంఘం ముఖ్య అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.