కొల్లాపూర్: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ముస్లిం మతపెద్దలు, మైనారిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కొల్లాపూర్ ఆర్డీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ ప్రభుత్వం మతాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని, మత సామరస్యాన్ని దెబ్బతీసే రాజకీయాలకు స్వస్తి పలకాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి రహీం, పలువురు యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్