కొల్లాపూర్: సిఎం పర్యటనకు సర్వం సిద్ధం..మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నార్లాపూర్ వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4వ, 5వ తేదీన సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అధికార యంత్రాంగంతో కలిసి పథకం పనులను పరిశీలించారు. సీఎం సందర్శించే ప్రదేశాలు, ఆయనకు పథకం పురోగతిని వివరించే విధానం, భద్రతా ఏర్పాట్లు, ప్రజా ప్రతినిధుల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్