శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో పెనుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగలు తాకి ఐదు పొట్టేళ్లు మృతి చెందాయి. గ్రామానికి చెందిన బొల్గం నాగశేషు తన వ్యవసాయ పొలానికి మేతకు తీసుకెళ్లిన ఐదు పొట్టేళ్లను విద్యుదాఘాతంతో కోల్పోయాడు. వీటి విలువ సుమారు రూ. 90 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.