అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ డిమాండ్ చేశారు. కొల్లాపూర్ పట్టణంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గతంలో జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని వారు పరిశీలించారు. సర్వే నంబర్ 72లో 130 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.