కొల్లాపూర్: కూల్ బీరు అడిగినందుకు ఖాళీ సీసాతో వ్యక్తిపై దాడి !

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో, ఈ నెల 5న ఆదివారం చల్లటి బీర్ అడిగినందుకు మద్యం దుకాణ యజమాని ఒక వ్యక్తిపై ఖాళీ సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, పలు ఒత్తిళ్ల కారణంగా కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం నడుపుతున్నట్లు గుర్తించిన కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ నాగిరెడ్డి, ఎస్ఐ హనుమంతు నాయక్ మంగళవారం దుకాణంలో తనిఖీలు చేపట్టారు. వేళలు పాటించకపోతే షాప్ సీజ్ చేస్తామని హెచ్చరించి, మొదటి తప్పుగా భావించి రూ. 15,000 జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్