కొల్లాపూర్: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

కల్తీ కల్లు ఘటనపై కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ 'ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్