కొల్లాపూర్: జింక మాంసం తరలిస్తున్న నలుగురు అరెస్ట్.!

మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని చింతలపల్లి గ్రామ సమీపంలో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 7 కిలోల జింక మాంసాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు, వారిని విచారణ కోసం అచ్చంపేట డీఎఫ్ఓ కార్యాలయానికి తరలించారు. అటవీ జంతువులను వేటాడటం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్