మాదక ద్రవ్యాలు జీవితానికి, సమాజానికి ప్రమాదకరమని శనివారం కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మాదకద్రవ్యాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహిస్తామని నిందితులకు శిక్షలు పడేలా చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, రవాణాపై ఎక్సైజ్, పోలీస్ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.