నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురానికి చెందిన బత్తిని మౌనిక, మాచినేనిపల్లి మాధవరావుపేటకు చెందిన నాగరాజు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గర్భిణి అయిన మౌనిక మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, భర్త నాగరాజు వేధింపుల వల్లే తన చెల్లి ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. మౌనిక మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.