కొల్లాపూర్: బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మల్లేశ్వరం గ్రామం నుంచి 15 మంది యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నయవంచక పాలనతో విసిగిపోయి, సుపరిపాలన కోసం కేసీఆర్ నాయకత్వంలో, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితోనే సాధ్యమని పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వారికి బీఆర్ఎస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్