కొల్లాపూర్: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న మంత్రి జూపల్లి

కొల్లాపూర్ ఎమ్మెల్యే, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు మంత్రి జూపల్లికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్