కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 20 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శంకుస్థాపనలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మంత్రి సుడిగాలి పర్యటన నిర్వహించి, మున్సిపాలిటీ భవనం, ఈదమ్మ ఆలయం, రామాలయం, వెంకటేశ్వర ఆలయాలలో వివిధ అభివృద్ధి పనులకు, అలాగే ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కళాభవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు.