గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను గొప్పగా పాలించాల్సింది పోయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం నీచమైన, దిగజారుడు చర్య అని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలు చట్ట పరిధిలో తమ పని చేస్తాయని, అందుకే బీఆర్ఎస్ పతనమైందని ఆయన పేర్కొన్నారు.