కొల్లాపూర్: అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వలక్ష్యం: మంత్రి జూపల్లి

పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్